రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై కువైట్ కొరడా

- July 06, 2024 , by Maagulf
రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై కువైట్ కొరడా

కువైట్: రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. జూన్ 30తో కార్మికులు కువైట్ ప్రకటించిన క్షమాభిక్ష పథకం గడువు ముగిసిన విషయం తెలిసిందే.  ప్రత్యేక భద్రతా దళాలు అల్-ఖురైన్, హవల్లీ మరియు మహ్బౌలా మార్కెట్‌లలో తనిఖీలను నిర్వహించాయి. ఈ సందర్భంగా149 మందిని అదుపులోకి తీసుకున్నారు. హవల్లి, ఫర్వానియా, అల్-ముత్లా మరియు అల్-దజీజ్‌లలో కూడా భద్రతా తనిఖీలను నిర్వహించారు. అక్కడ కూడా 114 మందిని అరెస్టు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారి ప్రయాణ టిక్కెట్‌కు చెల్లించే వారితో సహా, ఉల్లంఘించిన వారికి ఆశ్రయం కల్పించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.  భద్రతా ఏజన్సీలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికార యంత్రాంగానికి నివేదించాలని అధికారులు పిలుపునిచ్చారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com