తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..
- July 06, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త. జులై 9,16వ తేదిలలో శ్రీవారి ఆలయంలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. ఈ నెల 9వ తేదిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,16వ తేది ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. ఇక ఈ నెల 18వ తేదీన అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టిక్కేట్లను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనుంది.
ఇదిలా ఉంటె తిరుమల శ్రీవారి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65, 775 మంది భక్తులు కాగా.. 25, 126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3. 41 కోట్లు వచ్చాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







