ఇటలీలో బూడిదమయమైన విమానాశ్రయం..
- July 06, 2024
యూరప్ లోని అతిపెద్ద యాక్టివ్ అగ్నిపర్వతం అయిన మౌంట్ ఎట్నా విస్పోటనం చెందింది. అగ్నిపర్వతం బద్దలు కావటంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి.ఈ కారణంగా ఆకాశంలోకి భారీగా బూడిద వెదజల్లుతుంది. అగ్నిపర్వతంకు కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలన్నీ బూడిదమయం అయ్యాయి. ఇటాలియన్ ద్వీపం సిసిలీలోని కాటానియా విమానాశ్రయం సైతం బూడిదతో నిండిపోయింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఆ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
అగ్నిపర్వతం బద్దలై వెలువడిన బూడిద కారణంగా కాటానియా విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 90 విమానాలు రద్దు అయ్యాయని, సుమారు 15వేల మంది ప్రయాణికులకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ సాయంత్రం వరకు సాధారణ సర్వీసులు ప్రారంభమవుతాయని విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఇటలీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోఫిజికల్ అండ్ వాల్కనాలజీ ప్రకారం.. ఆకాశంలో 4.5కిలో మీటర్ల ఎత్తుకు బూడిద ఎగిసిపడిందని తెలిపింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అగ్నిపర్వతం వీడియోలో కాటానియా నగరంలోని రోడ్లు నల్ల బూడిదతో కప్పబడి ఉన్నాయి. ఇదిలాఉంటే.. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రయాణీకులు కాటానియా విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు. ఇటలీలో అత్యంత ప్రసిద్ద పర్యాటక కేంద్రాల్లో తూర్పు సిసిలీ ఒకటి. అక్కడికి ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు సాగిస్తుంటారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







