రాజ్‌తరుణ్ ఎందుకిలా చేస్తున్నాడు.!
- July 06, 2024
‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై చాలా తక్కువ టైమ్‌లోనే సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొట్టి హీరోగా బాగా లాభపడిపోయిన కుర్రోడు రాజ్ తరుణ్. బ్యాక్ టు బ్యాక్ డబుల్ హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
అయితే ఆ తర్వాత ఢీలా పడ్డాడనుకోండి. తాజాగా రాజ్ తరుణ్ వార్తల్లో హాట్ టాపిక్ అయ్యాడు. అందుకు కారణం ఆయన నటిస్తున్న సినిమానో మరోటో కాదు, తనను రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ ఆయన గాళ్ ఫ్రెండ్ రచ్చకెక్కడమే రాజ్ తరుణ్ హాట్ టాపిక్ అవ్వడానికి కారణం.
లావణ్య నార్సింగి అనే అమ్మాయితో రాజ్ తరుణ్ గత కొంత కాలంగా సహజీవనంలో వున్నాడు. దాదాపు 11 ఏళ్లు సహజీవనం చేసిన ఆయన ఇప్పుడు ఆమెకు హ్యాండిచ్చాడట. రాజ్ తరుణ్ అంటే తనకెంతో ఇష్టమనీ, ఎలాగైనా ఆయనను తనకు దక్కేలా చేయాలని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే గతంలోనూ ఈ తరహా రచ్చ రాజ్ తరుణ్ విషయంలో జరిగింది. హీరోయిన్ హెబ్బా పటేల్‌తో రాజ్ తరుణ్‌కి ఎఫైర్ వుందన్న టాక్ కూడా నడిచింది ఆ టైమ్‌లో.
అప్పుడేదో అలా సద్దుమనిగిన ఆ ఇష్యూ మళ్లీ ఇప్పుడు కొత్తగా తెర పైకి వచ్చింది. తన తప్పేమీ లేదనీ, లావణ్య కావాలని తనను బద్నాం చేస్తోందనీ, గతంలో ఆమెతో రిలేషన్‌లో వున్నప్పటికీ ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదనీ, ఆమె చేస్తున్న ఆరోపణలపై లీగల్‌గా తాను కూడా ప్రొసీడ్ అవుతానని రాజ్ తరుణ్ చెబుతున్నాడు. చూడాలి మరి, ఎలా సద్దుమనుగుతుందో రాజ్ ఈ రచ్చ.!
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







