అయ్యో పాపం.! అడ్డంగా బుక్కయిపోయిన సమంత.!
- July 06, 2024
సమంతకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా అదో పెద్ద సంచలనమే. ఆమెకు ‘మయోసైటిస్’ అనే వ్యాధి వుందని తెలిసినప్పటి నుంచీ మరింత సంచలనంగా మారింది సమంత.
తాజాగా నైట్రోజన్ ఫెరాక్సైడ్ గురించి సమంత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయ్. తనకు ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా నెబిలైజేషన్ చేస్తే తగ్గిపోతుందని సూచిస్తూ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది.
ఆ పోస్ట్‌కి పలువురు డాక్టర్లు వ్యతిరేకిస్తూ పోస్టులు చేశారు. సమంత చేసిన హెల్త్ టిప్స్ ఫాలో చేస్తే కొన్ని సార్లు ప్రాణానికి సైతం ప్రమాదం అని సూచించారు.
సమంతలాంటి పేరున్న సెలబ్రిటీ ఇలాంటి హెల్త్ టిప్స్ సూచించడం ఎంతవరకూ సబబు.? అంటూ విమర్శలు గుప్పించారు. దాంతో, సోషల్ మీడియాలో సమంతను ఆడి పోసుకుంటున్నారు. తనకు పని చేసిన వైద్యాన్ని అందరికీ సూచించడం కరెక్ట్ కాదనీ, కొందరికి పని చేసిన వైద్యం, ఇంకొందరికి వికటించొచ్చనీ అయినా నెబులైజేషన్‌లో వాడే హైడ్రోజన్ పెరాక్సైడ్ అత్యంత ప్రమాదరకరమైనదనీ వైద్యులు సూచిస్తున్నారు.
ఈ రకంగా సమంత దారుణంగా టార్గెట్ అయిపోయింది. అయితే తనపై వస్తున్న ఈ విమర్శలకు స్పందిస్తూ సమంత, తానేమీ వెనకా ముందూ ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదనీ, డబ్బులు ఖర్చు చేయలేని సామాన్యుల కోసమే తాను ఈ హెల్త్ టిప్ చెప్పాననీ, తనకు ట్రీట్ చేసే వైద్యునికి దాదాపు 25 ఏళ్ల అనుభవం వుందనీ, ఆయన సూచనతోనే ఈ టిప్ చెప్పానంతే కానీ, తానేమంత అమాయకురాలిని కాదని తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించింది సమంత. ఏది ఏమైనా బుకాయించి అడ్డంగా బుక్కయిపోయిందంటూ ఆమె రియాక్షన్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







