హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
- July 06, 2024
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మరో ఇద్దరు అధికారులు ఉన్నారు.
చంద్రబాబు నాయుడితో పాటు మంత్రులు కందుల దుర్గేశ్, సత్య ప్రసాద్, బీసీ జనార్దన్ ఉన్నారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, అధికారులు కార్తికేయ మిశ్రా, రవిచంద్ర ఉన్నారు.
ఉమ్మడి విభజన సమస్యలపై పరిష్కారంపై చంద్రబాబు, రేవంత్ చర్చించనున్నారు. తొలిసారి ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. భేటీ అనంతరం ఇరువురు సీఎంలు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అలాగే, ప్రజాభవన్ లోనే చంద్రబాబు టీమ్ డిన్నర్ చేస్తుంది.
- షెడ్యూల్డ్ 9, 10 లోని పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా చర్చలు
- పోలవరం ముంపుకు దూరంగా ఉన్న ఐదు గ్రామాలపై చర్చ
- కృష్ణా జలాలవివాదం చర్చ
- పోలవరం ముంపుకు దూరంగా ఉన్న ఐదు గ్రామాలపై చర్చ
- విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం
- విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









