ఇరాన్ అధ్యక్షుడికి కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ శుభాకాంక్షలు

- July 07, 2024 , by Maagulf
ఇరాన్ అధ్యక్షుడికి కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ శుభాకాంక్షలు

రియాద్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌కు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అభినందనలు తెలిపారు. రెండు సోదర దేశాలు, ప్రజల మధ్య సంబంధాలను కొనసాగించడం, అలాగే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత, శాంతిని పెంపొందించడానికి సమన్వయం సంప్రదింపులను కొనసాగించాలని ఆకాంక్షించారు.  ఇరాన్ ప్రజలకు మరింత పురోగతి, శ్రేయస్సుతోపాటు అధ్యక్షుడు పెజెష్కియన్ కు మంచి ఆరోగ్యం  ఇవ్వాలని కోరారు. అదే విధంగా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు అభినందన కేబుల్‌ను పంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com