115,000 దిర్హామ్‌లు చోరీ..మాజీ ఉద్యోగికి జైలుశిక్ష, జరిమానా
- July 07, 2024
దుబాయ్: ఒక సాధారణ ట్రేడింగ్ కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి.. సంస్థ నుండి రెండేళ్లకు పైగా గణనీయమైన మొత్తంలో డబ్బును అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. బహిష్కరణతో పాటు ఒక నెల జైలు శిక్ష విధించారు. అతను మోసం చేసిన దానికి సమానమైన మొత్తం జరిమానా కింద విధించారు. అంతకుముందు, దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 2017 నుండి డిసెంబర్ 2019 వరకు అల్ మురఖబాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ నేరానికి 34 ఏళ్ల భారతీయ పౌరుడిపై అభియోగాలు నమోదు చేశారు. ఖాతాదారులకు వస్తువులను డెలివరీ చేయడం మరియు బకాయిలు వసూలు చేయడం వంటి బాధ్యత కలిగిన నిందితుడు మొత్తం 114,966 దిర్హామ్‌లను తన జేబులో వేసుకున్నాడని విచారణలో గుర్తించారు. డ్రైవర్‌గా తన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు సదరు వ్యక్తి అకౌంటింగ్ రికార్డులను తారుమారు చేశాడని దుబాయ్ క్రిమినల్ కోర్టులోని న్యాయమూర్తులు తమ తీర్పులో వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







