‘ఇండియన్ 2’లో కాజల్ వుందా.? లేదా.?
- July 09, 2024
చందమామ కాజల్ అగర్వాల్‌కి ఈ మధ్య పదే పదే అన్యాయం జరుగుతూ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఆమెతో కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారు. ఒక పాట కూడా వుంది అందులో. అయితే, చివరికి వచ్చేసరికి కాజల్ క్యారెక్టర్ మొత్తానికి లేపేశారు. అప్పట్లో అదో సంచలనం. అయితే, కాజల్‌కివ్వాల్సిన రెమ్యునరేషన్ ఇచ్చి, గౌరవంగా ఆమె అనుమతితోనే ఆ సినిమా నుంచి ఆ క్యారెక్టర్ తీసేశారనుకోండి.
మళ్లీ ఇప్పుడు కూడా కాజల్ అదే పరిస్థితిని ఎదుర్కొంటోందా.? అంటే అవుననే అనుమానాలే వస్తున్నాయ్. ‘ఇండియన్ 2’ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ అంటూ ప్రచారం నడిచింది.
అయితే, మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా వుంది. కానీ, ఈ సినిమా ప్రమోషన్లలో ఎక్కడా కాజల్ కనిపించడం లేదు. టీజర్‌లో కానీ, ట్రైలర్రలో కానీ, ఒక్క పోస్టర్‌లో కానీ కాజల్ కనిపించలేదింతవరకూ.
మొన్న ముంబయ్‌లో జరిగిన ఈవెంట్, తాజాగా హైద్రాబాద్‌లో జరిగిన ఈవెంట్.. ఎక్కడా కాజల్ కనిపించలేదు. మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ సైతం కనిపిస్తున్నారు. కానీ, కాజల్ జాడే లేదెక్కడ.
రీసెంట్‌గా కాజల్ నటించిన ‘సత్యభామ’ సినిమా ప్రమోషన్లలో కాజల్ చక్కగా కనిపించింది. ఒకవేళ ఈ సినిమాలో వుండి వుంటే కనుక ప్రమోషన్లకు రాకుండా వుంటుందా.? ఈ విషయంలో కాజల్ కానీ, ‘ఇండియన్ 2’ టీమ్ కానీ స్పందించాల్సి వుందంటూ కాజల్ అభిమానులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







