బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే ఎందుకు?
- July 09, 2024
బుల్లితెర పై బిగ్‌బాస్ గేమ్ షో ఎంత నెగిటివిటీ ఫేస్ చేసినా ఆ షోకి వుండే క్రేజే వేరే లెవల్. తిట్టుకుంటూనే ఆ షో గురించి మాట్లాడుకుంటుంటారు జనం.
తాజాగా బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ టైమొచ్చింది. సీజన్ స్టార్ట్ అవ్వడానికి రెండు మూడు నెలల ముందే ఈ షోకి సంబంధించిన కథనాలు మీడియాలో ట్రెండింగ్ అవుతుంటాయ్.
కంటెస్టెంట్ల పేర్లు కూడా అలాగే ట్రెండ్ అవుతుంటాయ్. ఈసారి బిగ్ హౌస్‌లో సందడి చేసేవాళ్లు వీళ్లేనట.. అంటూ వేడి వేడిగా ఎవరికి తోచిన కథనాలు వారు వండి వడ్డించేస్తుంటారు.
ఎక్కువగా పాపులర్ సెలబ్రిటీలను బిగ్ హౌస్‌లో కంటెస్టెంట్లుగా తీసుకుంటుంటారు. అలా లేటెస్ట్ వైరల్ పర్సన్స్ పేర్లు కొన్ని నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయ్. వారిలో రాజకీయాల పరంగా పాపులర్ అయిన బర్రెలక్క, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని జోస్యం చెప్పిన వేణు స్వామి పేర్లుండడం విశేషం.
అలాగే, రేవ్ పార్టీ పేరు చెప్పి ట్రెండింగ్ అయిన నటి హేమ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, గతంలో ఆల్రెడీ హేమ బిగ్‌బాస్ హౌస్‌లో (చాలా తక్కువ వారాలు 1 లేదా 2) సందడి చేసిన సంగతి తెలిసిందే.
లావణ్య అనే యువతితో డేటింగ్ రచ్చకెక్కిన నటుడు రాజ్ తరుణ్ పేరు కూడా వినిపిస్తోంది. అంతకు ముందే రాజ్ తరుణ్ పేరు వినిపించింది. బహుశా ఈ గేమ్ షో పాపులారిటీ కోసమే మనోడు ఇలా రచ్చకెక్కాడో ఏమో అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఫైనల్లీ ఎవరెవరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా వస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ డేస్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







