బహ్రెయిన్‌లో 118 కార్మికులపై బహిష్కరణ వేటు
- July 09, 2024
మనామా: బహ్రెయిన్‌లో కార్మిక చట్టాల ఉల్లంఘనలను లక్ష్యంగా చేసుకుని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) వారం రోజుల పాటు నిర్వహించిన తనిఖీ ప్రచార ఫలితాలను ప్రకటించింది. జూన్ 30 నుండి జూలై 6 వరకు 616 తనిఖీలను నిర్వహించింది. 50 మంది అక్రమ కార్మికులను నిర్బంధించగా.. 118 మందిని ఉల్లంఘించిన వారిని బహిష్కరించింది. అన్ని గవర్నరేట్‌లలోని వాణిజ్య సంస్థలలో 600 వ్యక్తిగత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయత, పాస్‌పోర్ట్‌లు మరియు నివాస వ్యవహారాలు (NPRA), భద్రతా డైరెక్టరేట్‌లు, ప్రత్యామ్నాయ శిక్షల జనరల్ డైరెక్టరేట్, పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ , బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. ఏదైనా అనుమానాస్పద ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను LMRA వెబ్‌సైట్ (https://lmra.gov.bh/en/home), జాతీయ సూచనలు మరియు ఫిర్యాదుల వ్యవస్థ (తవాసుల్) ద్వారా లేదా LMRA కాల్ సెంటర్‌కు 17506055కు కాల్ చేయడం ద్వారా తెలియజేయాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







