వాహనాలను క్లియర్ చేయాలని దుబాయ్ మునిసిపాలిటీ హెచ్చరిక
- July 11, 2024
యూఏఈ: ఎమిరేట్‌లోని తొమ్మిది రిజిస్ట్రేషన్ మరియు పరీక్షా కేంద్రాలలో వదిలేసిన వాహనాలను వాటి యజమానులు వెంటనే క్లియర్ చేయకపోతే వాటిని జప్తు చేస్తామని అధికారులు ప్రకటించారు. దుబాయ్ మునిసిపాలిటీ 68 వాహన క్లియరెన్స్ హెచ్చరికలను జారీ చేసింది. వార్సన్, ఖుసైస్, షామిల్ ముహైస్నా, వాసెల్ నద్ అల్ హమర్, తమామ్, అల్ అవీర్ మోటార్ షో, అల్ బర్షా, అల్ ముమయాజ్ మరియు వాసెల్ అల్ జదాఫ్ కేంద్రాలలో ఈ ప్రచారం నిర్వహించారు. నోటీసులో పేర్కొన్న వ్యవధిలోగా వాహనం క్లియర్ కాకపోతే, అది అల్ అవీర్ ప్రాంతంలోని ఇంపౌండ్‌మెంట్ యార్డ్‌కు తరలిస్తామని, వేలం వేయడానికి ముందు, యజమాని మున్సిపాలిటీ అధికారులను సంప్రదించడం ద్వారా దాన్ని తిరిగి పొందవచ్చని దుబాయ్ మునిసిపాలిటీలోని వేస్ట్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ సయీద్ సఫర్ తెలిపారు.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







