తీవ్రవాద గ్రూపు సభ్యులకు జీవిత ఖైదు, Dh20 మిలియన్ల జరిమానా
- July 11, 2024
యూఏఈ: జస్టిస్ అండ్ డిగ్నిటీ ఆర్గనైజేషన్ కేసులో అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ స్టేట్ సెక్యూరిటీ డివిజన్ ఉగ్రవాద ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థకు చెందిన 53 మంది సభ్యులతో పాటు ఆరు కంపెనీలను దోషులుగా నిర్ధారించింది. వారికి యావజ్జీవ కారాగార శిక్ష నుండి 20 మిలియన్ దిర్హాంల వరకు జరిమానాను కోర్టు విధించింది.
ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఉద్దేశ్యంతో జస్టిస్ అండ్ డిగ్నిటీ ఆర్గనైజేషన్‌ను స్థాపించడం మరియు నిర్వహించడం పై కేసు నమోదు చేసి నలభై-మూడు మంది నిందితులకు జీవిత ఖైదు విధించారు. సోషల్ మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేసి సహకరించినందుకు ఐదుగురు నిందితులకు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. నిధులు సమకూర్చడం ద్వారా మనీలాండరింగ్ నేరాలకు పాల్పడినందుకు మరో ఐదుగురు నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష , ఒక్కొక్కరికి 10 మిలియన్ల జరిమానా విధించారు. ఆరు కంపెనీలు మరియు వాటి అధికారులకు ఒక్కొక్కరికి Dh20 మిలియన్ల జరిమానా విధించారు.
రిఫార్మ్ కాల్ ఆర్గనైజేషన్‌కు సహకరించినందుకు మరియు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 24 మంది నిందితులపై ఉన్న క్రిమినల్ కేసులను కోర్టు కొట్టివేసింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







