రకుల్ లక్కు మామాలుగా లేదుగా.!
- July 11, 2024
రకుల్ పనైపోయిందనుకున్న ప్రతీసారీ మళ్లీ స్టార్ ఛాన్స్‌తో దూసుకొస్తోంది. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోలందరి సరసనా నటించేసింది అప్పట్లో.
ఆ తర్వాత బాలీవుడ్కెళ్లింది. అటుపై తెలుగులో అవకాశాలు తగ్గినా.. బాలీవుడ్లో మంచి మంచి ఆఫర్లు అందుకుంటోంది. అవన్నీ ఒకెత్తయితే, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘భారతీయుడు 2’ ఇంకో ఎత్తు ఆమె కెరీర్లో.
‘భారతీయుడు 2’ సాధారణ సినిమా కాదు. ఇలాంటి సినిమాలో ఆఫర్ అంటే అంత ఆషా మాషీ కాదు. అలాంటిది రకుల్‌కి ఆ ఛాన్స్ దక్కింది. ప్రచార చిత్రాలు చూస్తుంటే ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత వున్నట్లే కూడా వుంది.
కేవలం ‘భారతీయుడు 2’ మాత్రమే కాదు, ‘భారతీయుడు 3’లోనూ రకుల్‌కి మంచి స్కోప్ వుండబోతోందట. చూస్తుంటే, ఇప్పట్లో రకుల్ కెరీర్‌కి ఢోకా లేదనిపిస్తోంది.
ఈ సినిమా తర్వాత తెలుగులోనూ రకుల్‌కి మళ్లీ మంచి మంచి ఆఫర్లొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. చూడాలి మరి. ‘భారతీయుడు 2’ ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ సేనాపతిగా లీడ్ రోల్ పోషిస్తుండగా, సిద్దార్ధ్, ఎస్.జె సూర్య, సముద్ర ఖని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







