కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ ఇది విన్నారా.?

- July 11, 2024 , by Maagulf
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ ఇది విన్నారా.?

యంగ్ హీరోల్లో ఓ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణివారు’ సినిమాతో చాలా మామూలుగా పరిచయమైన ఈ కుర్ర హీరో, ఆ తర్వాత ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’, ‘వినరా భాగ్యము విష్ణు కథ’, ‘రూల్స్ రంజన్’  ‘మీటర్’ తదితర సినిమాలతో గుర్తింపు దక్కించుకున్నాడు.

ఈ హీరో నటిస్తున్న సినిమాలు హిట్టవుతున్నాయా.? ఫట్ అవుతున్నాయా.? అనే సంగతి పక్కన పెడితే, అవకాశాలు మాత్రం వరుసగా వస్తూనే వున్నాయ్. ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడీ యంగ్‌స్టర్.

అదే ‘క (KA)’. ఇదేనండీ సినిమా టైటిల్. ఓహో K అంటే కిరణ్ A అంటే అబ్బవరం.. తన పేరే అనుకుంటున్నారు కదా. నిజానికి అంతే. కానీ, సినిమాలో ఈ రెండు అక్షరాలకూ ఏదో బలమైన అర్ధముండబోతోందట. అందుకే ఆ టైటిల్ పెట్టారట. కోఇన్సిడెంట్‌గా తన పేరు మీదుగా ఈ టైటిల్ అలా సెట్టయిపోయింది.

టైటిల్‌తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన కిరణ్ అబ్బవరం సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో కానీ, ఇదో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాని తెలుగుతో పాటూ, సౌత్‌లోని పలు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారట. సుజిత్ అండ్ సందీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com