‘మిస్టర్ బచ్చన్’ వెర్సస్ ‘ఇస్మార్ట్ శంకర్’.! పోటీ గట్టిగానే.!
- July 11, 2024
ఆగస్టు 15 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రూలింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. అనుకోని కారణాలతో ఆ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ కావడంతో రామ్ పోతినేని - పూరీ జగన్నాధ్ కాంబో మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ లైన్‌లోకి వచ్చింది.
అదే డేట్‌కి సోలో రిలీజ్ అని ప్రకటించుకుంది. అయితే, లేటెస్ట్‌గా ఇదే డేట్‌లోకి మాస్ రాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో వచ్చి చేరాడు. దాంతో, ‘ఇస్మార్ట్ శంకర్’కి గట్టి పోటీ కుదిరింది.
రెండూ మాస్ ఓరియెంటెడ్ సినిమాలే. రెండు సినిమాల డైరెక్టర్లూ గట్స్ వున్నవాళ్లే. ఈ పోటీ బాక్సాఫీస్‌కీ ఆరోగ్యకరమే. ఇలాంటి పెద్ద సినిమాలు పోటీగా రిలీజ్ అయితేనే బాక్సాఫీస్ కళకళలాడుతుంది.
అయితే, ఈ సినిమాల రిజల్ట్ ఇద్దరు హీరోలకీ అగ్ని పరీక్షే. ప్రస్తుతం రామ్ పోతినేనికి ఓ బడా హిట్ కావాలి. అలాగే, మాస్ రాజా రవితేజకీ. ‘ఇస్మార్ట్ శంకర్’ అంచనాలతో ఈ సినిమాపైనా అంచనాలు బాగున్నాయ్.
అలాగే, బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’కి రీమేక్‌గా, రీమేకుల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కావడంతో, ‘మిస్టర్ వచ్చన్’ పైనా అంచనాలు బాగానే వున్నాయ్. చూడాలిక బాక్సాఫీస్ వద్ద ఏ హీరో దమ్మెంతో.!
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









