‘పొలిమేర 3’ కి రంగం సిద్ధం.!
- July 11, 2024
సత్యం రాజేష్ హీరోగా వచ్చిన ‘పొలిమేర’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మూఢ నమ్మకాల బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్‌కి ధియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
అదే ఉత్సాహంతో ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా రూపొందించారు. అదే ‘పొలిమేర 2’. అయితే, ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు. రెండో పార్ట్‌కీ రెస్పాన్స్ అదిరిపోయింది. సత్యం రాజేష్‌తో పాటూ, బాలాదిత్య, గెటప్ శీను తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
హీరోయిన్గా నటించిన కామాక్షి భాస్కర్లకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయ్ ఈ రెండు సినిమాలు. అనిల్ విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలకి భోగేంద్ర గుప్త నిర్మాతగా వ్యవహరించారు.
కాగా ఈ సినిమాకి లేటెస్ట్గా మూడో పార్ట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్లు. మూడో పార్ట్‌ని మరింత థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించబోతున్నట్లుగా ప్రకటించారు.
రెండో పార్ట్ చివరిలో భర్త అయిన సత్యం రాజేష్‌ని విషం పెట్టి చంపేసి, తాను కూడా చనిపోతుంది కామాక్షి భాస్కర్ల. అక్కడితో సినిమా అయిపోలేదు. మూడో పార్ట్‌లో కూడా ఈ రెండు పాత్రలూ కంటిన్యూ కానున్నాయ్. అంటే ఈ పాత్రల్ని ఎలా ఎక్కడ కనెక్ట్ చేస్తారో.. అనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో నెలకొంది. అలాగే పాత క్యారెక్టర్లతో పాటూ, కొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా ఈ మూడో పార్ట్‌లో యాడ్ కానున్నాయట.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







