‘తంగలాన్’.! మంత్రగత్తెగా మాళవిక పర్ఫామెన్స్ అద్భుతహ.!
- July 11, 2024
చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. ఎప్పుడో రిలీజ్ కావల్సి వుంది ఈ సినిమా. అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా, తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్లు.
ఇదో ప్రయోగాత్మక చిత్రమనీ ముందుగానే ప్రచారం సాగుతోంది. లీడ్ రోల్ పోషించిన విక్రమ్ గెటప్ చాలా కొత్తగా వింతగా వుంది. అలాగే హీరోయిన్గా నటించిన మాళవిక మోహనన్ పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ పోషించింది. ఇంతవరకూ ఇది మాత్రమే తెలుసు. కానీ, ట్రైలర్ వచ్చాకా ఆమె పాత్రకి సంబంధించి ఓ కొత్త విషయం బయటపడింది.
హారతి అనే మంత్రగత్తె పాత్రలో మాళవిక మోహనన్ నటించింది ఈ సినిమాలో. ఈ పాత్ర చాలా సస్పీషియస్‌గా పవర్ ఫుల్‌గా కనిపిస్తోంది. కొన్ని చోట్ల యాక్షన్ బ్లాక్స్ కూడా కట్ చేశారు హారతి పాత్రలో.
చూస్తుంటే, మాళవిక మోహనన్‌కి తంగలాన్‌లో ఓ ఛాలెంజింగ్ రోల్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ పాత్రతో మాళవిక తన ఇమేజ్‌ని ఏ రేంజ్‌కి తీసుకెళ్లనుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







