NEET పేపర్ లీక్ కేసు.. కీలక సూత్రధారి అరెస్ట్

- July 11, 2024 , by Maagulf
NEET పేపర్ లీక్ కేసు.. కీలక సూత్రధారి అరెస్ట్

న్యూ ఢిల్లీ: నీట్‌-యూజీ (2024) పరీక్ష పేపర్‌ లీకేజీలో కీలక సూత్రధారిగా భావిస్తోన్న రాజేశ్‌ రంజన్‌ అనే వ్యక్తిని పట్నాలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం పట్నా, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ నేరానికి సంబంధించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి.

నిందితుడిని విచారించేందుకు స్థానిక కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో బుధవారం ఇద్దరిని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య పది దాటింది. ఇక నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com