ఏపీలో భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
- July 11, 2024
అమరావతి: ఏపీలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఐదు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రూ.60వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌కు కేంద్రం అంగీకరించింది.
కేంద్రంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వంలో కీలక మిత్రుడుగా చంద్రబాబు రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( బీపీసీఎల్ ) ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
రిఫైనరీ ఏర్పాటు అయ్యే మూడు ప్రాంతాలివేనా? :
అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెట్రోలియం రిఫైనరీ కోసం ఏపీలో మూడు ప్రధాన ప్రదేశాలపై చర్చించారు. వీటిలో శ్రీకాకుళం, మచిలీపట్నం, రామాయపట్నం ఉన్నాయి. జూలై 23న సమర్పించే బడ్జెట్లో రిఫైనరీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్థలాలను అంచనా వేసి, ఆపై ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రక్రియకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని, బడ్జెట్లో రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని ప్రకటించకపోవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిఫైనరీ ఏర్పాటు చేయబోయే మూడు లొకేషన్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నందున ఈ ప్రకటన రాజకీయంగా సున్నితమైనదిగా చెప్పవచ్చు.
చంద్రబాబుకు చెందిన 16 మంది ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వానికి అవసరమైన మద్దతును అందిస్తారు. రిఫైనరీ అనేది రాష్ట్ర విభజన సమయంలో చేసిన నిబద్ధత, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నిర్దేశించింది. చట్టంలోని సెక్షన్ 93 ప్రకారం.. పదమూడవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!







