NEET పేపర్ లీక్ కేసు.. కీలక సూత్రధారి అరెస్ట్
- July 11, 2024
న్యూ ఢిల్లీ: నీట్-యూజీ (2024) పరీక్ష పేపర్ లీకేజీలో కీలక సూత్రధారిగా భావిస్తోన్న రాజేశ్ రంజన్ అనే వ్యక్తిని పట్నాలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం పట్నా, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ నేరానికి సంబంధించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి.
నిందితుడిని విచారించేందుకు స్థానిక కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో బుధవారం ఇద్దరిని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య పది దాటింది. ఇక నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







