స్పెయిన్ ని చుట్టేస్తున్న పూరి-కళ్యాణ్ లు
- June 14, 2016
సినిమా వాళ్ళందరూ సెలవులు ముగించుకుని షూటింగ్‌కి తయారవుతుంటూ వీళ్ళిద్దరూ ఇప్పుడు టూర్ మొదలెడుతన్నారా అని పొరపడేరు. ఈ ఇరువురూ స్పెయిన్ పయనమవుతోంది సినిమా కోసమే. ఆ మాటకొస్తే పూరి సినిమాల్లో తప్పితే వ్యక్తిగత జీవితంలో 'విరామం' ఉండదన్న విషయం సినీలోకమెరిగిందే. ఇక ప్రస్తుతం విషయానికొస్తే కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. జులై 1 నుండి స్పెయిన్‌లో తర్వాతి షెడ్యూల్ జరుగనుందిట. నెల రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ కోసం ఇప్పటికే పనులన్నీ చక్కబెట్టారట చిత్ర బృందం.
ఈ సినిమాలో అదితి ఆర్య కళ్యాణ్ రామ్‌తో ఆడిపాడనుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాని దసరా రేసులో నిలపనున్నారట డాషింగ్ డైరెక్టర్. రామ్ చరణ్, రామ్‌లు ఇప్పటికే దసరా నాటికి ఖర్చీఫ్ వేసుంచారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ చేరాడు. ముందు ముందు ఈ లిస్ట్ ఇంకెంత పెరుగుతుందో.
తాజా వార్తలు
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







