రాష్ట్రపతి రేసులో వినపడుతున్న మరో పేరు మురళీ మనోహర్ జోషి
- June 14, 2016
వచ్చే ఏడాదితో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుండటంతో ఆ తర్వాత భాజపా నుంచి ఎవరు రాష్ట్రపతి అవుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆ పదవి కోసం కొందరు భాజపా సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రేసులో మరో భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పేరు సైతం చేరింది. ఇప్పటికే ఆయన ఈ పదవి కోసం, ఆర్‌ఎస్‌ఎస్, భాజపా అగ్రనాయకులతో మంతనాలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
జోషీ ఈ విషయమై ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, పలువురు సీనియర్ భాజపా, సంఘ్ నేతల్ని కలిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రపతి పదవి గురించి ఆయన వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సంఘ్ నిర్ణయం సైతం కీలక పాత్ర పోషించనుంది. వారి నిర్ణయం ప్రకారమే ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలు కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ నేత దేవేంద్ర స్వరూప్ జోషీకి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







