షార్జా, అజ్మాన్‌లలో పెరుగుతున్న అద్దెలు..!

- July 14, 2024 , by Maagulf
షార్జా, అజ్మాన్‌లలో పెరుగుతున్న అద్దెలు..!

యూఏఈ: అద్దెపై కొంత డబ్బు ఆదా చేయాలనుకునే దుబాయ్ నివాసితులు సాధారణంగా షార్జా, అజ్మాన్‌లకు వెళ్లాలని భావిస్తారు. ఈ రెండు సమీపంలోని ఎమిరేట్స్‌లో ఇప్పుడు డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. కొన్ని ఒకటి నుండి రెండు పడకగదుల అపార్ట్‌మెంట్‌లు 2023 చివరి త్రైమాసికంలో ఉన్నదానికంటే ప్రస్తుతం 20 శాతం పెరిగినట్టు  నిపుణులు తెలిపారు. "నివాసులు షార్జా మరియు అజ్మాన్‌లను ఇష్టపడటానికి ప్రధాన కారణం దుబాయ్ కంటే అద్దెలు తక్కువగా ఉండటం" అని ఎమాన్ ప్రాపర్టీస్ LLC వ్యవస్థాపకుడు రైఫ్ హసన్ ఇక్కేరి అన్నారు. కోవిడ్ అనంతర కాలంలో యూఏఈలో అద్దె రేట్లు క్రమంగా పెరుగుతున్నాయని, షార్జా మరియు అజ్మాన్‌లలో కొత్త ప్రాజెక్టులు రావడంతో డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. అదే సమయంలో ఎక్కువ మంది ప్రజలు నార్తర్న్ ఎమిరేట్స్‌కు, ముఖ్యంగా షార్జాకు షిఫ్ట్ కావడం కూడా అద్దెల పెరుగుదలకు కారణం అని ఎ అండ్ హెచ్ రియల్ ఎస్టేట్ మేనేజర్ మహమ్మద్ రేయాన్ తెలిపారు. "2023 చివరి నాటికి షార్జాలోని ప్రముఖ ప్రాంతాల్లో సింగిల్ బెడ్ రూపం అద్దెలు ఏడాదికి 24,000 దిర్హామ్‌ల ఉండగా.. ఇప్పుడు అద్దెలు 30,000 నుండి 36,000 వరకు పెరిగాయని రేయాన్ వెల్లడించారు.     

రస్ అల్ ఖైమాలో పెరుగుతున్న పరిశ్రామిక వృద్ధి కూడా షార్జా మరియు అజ్మాన్‌లలో రెసిడెన్షయల్ ప్లాట్లకు డిమాండ్‌ పెరిగేందుకు కారణం అవుతుందని నిపుణులు తెలిపారు.  మరోవైపు 2023 ప్రారంభంలో పోలిస్తే దుబాయ్‌లో అద్దెలు ఇప్పటికే 30 శాతం పెరిగాయని, ఇది షార్జా,  అజ్మాన్‌లోని అద్దె మార్కెట్‌పై అలల ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com