అనంత్- రాధిక ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుక..హాజరైన ప్రధాని మోదీ..
- July 14, 2024
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ నవ వధూవరులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ‘ శుభ్ ఆశీర్వాద్’ (ఆశీర్వాద వేడుక)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను మోదీ ఆశీర్వదించారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
అంబానీ వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన ‘శుభ్ ఆశీర్వాద్’కి బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ ప్రముఖులు, ఇతర ప్రజా ప్రముఖులు హాజరయ్యారు. ఆదివారం రోజున ‘మంగళ ఉత్సవ్’ లేదా వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో రూ. 29వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం శంకుస్థాపన చేశారు. వీటిలో రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులు ఉన్నాయి.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







