భార‌త్-శ్రీలంక షెడ్యూల్‌లో మార్పులు..

- July 14, 2024 , by Maagulf
భార‌త్-శ్రీలంక షెడ్యూల్‌లో మార్పులు..

టీమ్ఇండియా ఈ నెలాఖ‌రులో శ్రీలంక‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడ‌నుంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుద‌ల చేసింది. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్త‌వానికి ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం జూలై 26 నుంచి టీ20సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే.. ఒక్క‌రోజు ఆల‌స్యంగా అంటే జూలై 27 కి మార్చారు. అలాగే వ‌న్డే సిరీస్ ఆగ‌స్టు 1 నుంచి ఆరంభం కావాల్సి ఉండ‌గా ఒక్క రోజు ఆల‌స్యంగా ఆగ‌స్టు 2 నుంచి ప్రారంభం కానుంది.

భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ కొత్త షెడ్యూల్..
టీ20 సిరీస్..
తొలి టీ20–జూలై 27న‌
రెండ‌ టీ20–జూలై 28న‌
మూడో టీ20–జూలై 30న

వన్డే సిరీస్..
తొలి వ‌న్డే–ఆగస్టు 2న‌
రెండో వన్డే–ఆగస్టు 4న‌
మూడో వ‌న్డే–ఆగస్టు 7న‌

టీ20 సిరీస్‌లోని మ్యాచులు అన్ని భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7 గంట‌లకు ప్రారంభం కానున్నాయి.వ‌న్డే సిరీస్‌లోని మ్యాచులు అన్ని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జ‌రుగుతాయి. కాగా.. ఈ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ ఇంకా ఎంపిక చేయ‌లేదు. త్వ‌ర‌లోనే జ‌ట్టును ప్ర‌క‌టించ‌నుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com