జులై 1 నుంచి ఇండియాలో ఇండియన్లకీ వీసా.!
- June 14, 2016
జూన్ నెలాఖరులోగా తమ వద్దనున్న పిఐఓ (పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ కార్డ్)ని ఓసిఐ కార్డ్ (ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డ్)తో రీప్లేస్ చేసుకోని పక్షంలో, జులై 1 నుంచి ఇండియాకి వెళ్ళాలనుకునేవారికి వీసా తప్పనిసరవుతుంది. ఆఖరి నిమిషంలో సమస్యలు కొనితెచ్చుకోకుండా వీలైనంత త్వరగా ఈ ప్రాసెస్‌ని పూర్తి చేసుకోవాల్సిందిగా యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ విజ్ఞప్తి చేశారు. ఇండియన్ అంబాసిడర్ టు యూఏఈ టి.పి. సీతారామ్ మాట్లాడుతూ, కార్డుల జారీకి సమయం పడుతుందనీ, అవి న్యూ ఢిల్లీ నుంచి జారీ చేయబడ్తాయనీ, కార్డు కోసం అప్లయ్ చేయనివారు ఇండియాకి వెళ్ళాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందని వివరించారు. పిఐఓ కార్డు పదేళ్ళ కాలానికి పనిచేస్తుందని, ఓసిఐ కార్డు లైఫ్ టైమ్ వాలిడిటీ కలిగి ఉంటుందని ఆయన చెప్పారు. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ పిఐఓ కార్డ్‌ని ఓసిఐ కార్డ్‌గా కన్‌వర్ట్ అవడానికి ఎలాంటి రుసుమూ వసూలు చేయడంలేదు. సర్వీస్ ఛార్జ్ 6 దిర్హామ్‌లను కూడా లెవీ చేయబడ్తుంది. సిజిఐ దుబాయ్, అప్లికేషన్లను స్వీకరిస్తుందనీ ఉదయం గంటల నుంచి 12 గంటల వరకు అన్ని పనిదినాల్లోనూ ఈ అవకాశం ఉంటుందని ఇండియన్ కాన్సులేట్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







