ఒమన్ లో కాల్పులు.. మృతుల్లో భారతీయుడు..!
- July 17, 2024
మస్కట్ః ఒమన్‌లోని మసీదు సమీపంలో జరిగిన కాల్పుల్లో కనీసం ఆరుగురు చనిపోయారు. అయితే మరణించిన వారిలో భారత్‌కు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని ఒమాన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ దాడిలో నలుగురు పాకిస్థానీయులతో పాటు ఇద్దరు చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరో 30 మంది గాయాలపాలైనట్లు పేర్కొన్నారు.ఈ ఘటన జరిగిన అనంతరం ఒక భారతీయుడు మృతి చెందగా..మరో భారతీయుడు గాయపడ్డారని ఒమాన్ విదేశాంగ శాఖ ఇండియన్ ఎంబసీకి తెలియజేసింది.
రాజధాని నగరం మస్కట్ గవర్నరేట్‌లోని వాడి అల్ కబీర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పాకిస్తానీ పౌరులు, ఒక పోలీస్ అధికారి కూడా మరణించారని వెల్లడించారు.కాగా, దీనిపై పాకిస్థాన్ అధికారులు స్పందించారు.దాడిలో మరణించిన పాకిస్థానీయుల మృతదేహాలను గుర్తించడం, స్వదేశానికి తీసుకురావడం కోసం ఒమన్‌లోని మా రాయబార కార్యాలయం ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు.ఇదిలా ఉండగా, గాయపడిన పాకిస్థానీల యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు రాయబారి ఇమ్రాన్ అలీ స్థానిక ఆసుపత్రులను సందర్శించారు. ఒమన్‌లో అబ్దుల్ సమద్: 92040038, ఖాదీం హుస్సేన్: 98577355, అమీర్ సఫ్దర్: +923225251612, సయ్యద్ నిసరుల్ హక్: 94981966, అతిక్ అహ్మద్: 0045 9976,
ముదస్సిర్: 91391584, రాయబారి సైఫుల్లా: 92109432 లను సంప్రదించాలని పాక్ ఎంబసీ కోరింది.
మరోవైపు గల్ఫ్ దేశంలోని తమ పౌరులకు మస్కట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం భద్రతా హెచ్చరికలు జారీ చేసింది."వాడీ కబీర్‌లో కాల్పుల ఘటనకు సంబంధించిన నివేదికలను యూఎస్ ఎంబసీ అనుసరిస్తోంది.అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలి, స్థానిక వార్తలను పర్యవేక్షించాలి మరియు స్థానిక అధికారుల ఆదేశాలను గమనించాలి." అని పేర్కొంది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







