'సాఫ్ట్వేర్ కంపెనీలు తరలిపోవచ్చు' - నాస్కామ్ హెచ్చరిక!
- July 17, 2024
బెంగళూరు: ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో స్థానికులకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రైవేటు సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) కోరింది. ఇటువంటి ఆంక్షలు విధిస్తే, నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కొరత ఏర్పడి, సాఫ్ట్వేర్ కంపెనీలు తరలివెళ్లడానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదే అంశంపై ప్రైవేటు రంగ నిపుణులు, సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి నిర్ణయాలతో కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతాయని, పెట్టుబడులు ఆగిపోతాయని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ హెచ్చరించారు. సాంకేతిక రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, దానిని ప్రభావితం చేసే బిల్లుని అనుమతించకూడదని బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా సూచించారు. నైపుణ్యమున్న సిబ్బంది నియామకాల విషయంలో మినహాయింపులు ఉండాలన్నారు.

తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







