అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత మళ్లీ ఆయనతోనే.!
- July 18, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే, ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, పోస్ట్‌పోన్ అవ్వడంతో డిశంబర్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం 30 రోజుల షూటింగ్ పెండింగ్ వున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ కానున్నాయ్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మికా మండన్నా హీరోయిన్ కాగా, మలయాళ నటుడు ఫహాద్ పాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఆ సంగతి అటుంచితే, మరో నెల రోజుల్లో అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేయనున్నారు. ఆ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేయాలనుకున్నారనీ సమాచారం.
అయితే, అల్లు అర్జున్ లిస్టులో ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి సక్సెస్ఫుల్ దర్శకులున్నారు. అలాగే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నాడనీ తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం వేరే ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. సో, త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్లో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అన్నట్లు ఈ కాంబో సూపర్ హిట్ కాంబో అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..







