సేనాపతి పరిస్థితేంటీ.? శంకర్ పనైపోయిందా..?
- July 18, 2024
‘భారతీయుడు 2’ పూర్తిగా నిరాశపరిచాడని తేల్చేశారు ట్రేడ్ పండితులు. లాభాలు కాదు కదా.. పెట్టిన పెట్టుబడుల్లోనే తీవ్రమైన నష్టాలొచ్చాయని ట్రేడ్ టాక్.
ఈ టాక్‌తో ‘భారతీయుడు 3’పై అంచనాలు తగ్గిపోయాయ్. ‘విక్రమ్’ అంచనాలతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయ్. కానీ, కమల్ ఈ సినిమాతో దారుణంగా నిరాశపరిచేశాడు.
అయితే, ‘భారతీయుడు’ మూడో పార్ట్ చాలా బాగుంటుందని ఈ సినిమా ప్రమోషన్లలో పదే పదే కమల్ హాసన్ చెప్పిన సంగతి తెలిసిందే. అంటే ‘భారతీయుడు 2’ పరిస్థితి రిలీజ్‌కి ముందే కమల్‌కి అర్ధమైపోయుంటుందనీ, అందుకే దీని ఫలితం ఎలా వున్నా.. మూడో పార్ట్ మాత్రం చాలా బాగుంటుందని అప్పుడే మూడో పార్ట్‌పై అంచనాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేసినట్లున్నారు కమల్ హాసన్.. అని అభిమానులు ఊహిస్తున్నారు.
ఈ డ్యామేజ్ కంట్రోల్ జరగాలంటే, వీలైనంత ఎర్లీగా ‘భారతీయుడు 3’ రావల్సిందే.. లేట్ అయ్యిందంటే ఆ ఇంపాక్ట్ ఇంకెలా వుంటుందో అని కూడా కమల్ హాసన్ అభిమానులు డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి, సేనాపతి ఏం చేస్తాడో.! శంకర్‌ని తొందరపెట్టి మూడో పార్ట్ కూడా వీలైనంత త్వరలో రిలీజ్‌కి సిద్ధం చేస్తాడేమో.!
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







