కొరటాల శివకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

- June 14, 2016 , by Maagulf
కొరటాల శివకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఓ రచయిత దర్శకుడు అయితే ఆ సినిమాకు ఉండే రేంజ్ వేరేలా ఉంటుంది. ఇక అదే అతనికి స్టార్స్ తోడైతే ఇక ఇండస్ట్రీ రికార్డులే.. ప్రస్తుతం అలాంటి క్రేజ్ తోనే ముందుకు దూసుకెళ్తున్నాడు కొరటాల శివ. ముందు రచయితగా ఆ తర్వాత దర్శకుడిగా ఆయన సిని ప్రస్థానం కొంతదే అయినా గొప్పదని చెప్పాలి.మిర్చి ఓపెనింగ్ నాడు ప్రభాస్, దిల్ రాజు, శివ :రచయితగా మారాలన్న ఆశతో తనకు తెలిసిన ఓ రిలేటివ్ రికమండేషన్ తో పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ గా చేరాడు కొరటాల శివ. అప్పటికే బి.టెక్ డిగ్రీ పూర్తి చేసిన శివ రచనా విభాగంలో మంచి పట్టు సాధించాడు. ఇక మొదటి సినిమాగా శివనాగేశ్వర రావు దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రచయితగా పనిచేశాడు.అయితే శంకర్ బోయ్స్ కు కొరటాల శివ గర్ల్ ఫ్రెండ్ కథకు దగ్గర సంబంధాలు ఉండటం విశేషం.
శ్రీమంతుడు షూట్ లో మహేష్, కొరటాల శివ :ఇక దాని తర్వాత బోయపాటి భద్ర సినిమాకు కథ, మాటలు అందించిన కొరటాల శివ ఒక్కడున్నాడు, మున్నా సినిమాలకు డైలాగ్స్ రాసి మంచి గ్రిప్ సాధించాడు. ఇక బృందావనం సినిమాకు స్టోరీ అందించిన కొరటాల శివ మరోసారి బోయపాటి సింహాకు రచన సహకారం అందించాడు. ఊర్సరవల్లి కూడా కొరటాల శివ మాటలు రాసినదే.జనతా గ్యారేజ్ ఓపెనింగ్ :అయితే రచయితగా ఉన్న తాను ఎందుకు మెగా ఫోన్ పట్టకూడదు అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడం ఆలస్యం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను ఒప్పించి మిర్చి అంటూ అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత శ్రీమంతుడు అంటూ ఊరిని దత్తత తీసుకునే కథతో సూపర్ స్టార్ మహేష్ కు మెమరబుల్ హిట్ ఇచ్చాడు.జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ :ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తెరకెక్కిస్తున్న కొరటాల శివ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రచయిత నుండి దర్శకుడిగా మారాక ఎక్కువ క్రేజ్ సంపాదించిన కొరటాల శివ ఆ క్రేజ్ ను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఎంతో కష్టపడుతున్నాడు. అంతేకాదు కొరటాల శివ దర్శకత్వం చేయాలని స్టార్స్ సైతం ఎదురుచూస్తున్నారు. మరి తీస్తున్న సినిమానే కాదు కొరటాల తీసే ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అయ్యి.. స్టార్ డైరక్టర్ గా కొరటాల శివ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ మరోక్క సారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com