‘తమ్ముడు’గా నితిన్ యాక్షన్ కుమ్ముడు.!

- July 21, 2024 , by Maagulf
‘తమ్ముడు’గా నితిన్ యాక్షన్ కుమ్ముడు.!

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ అయిన ‘తమ్ముడు’ టైటిల్‌ని ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాని భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘కాంతార’ ఫేమ్ సప్తమీ గౌడ హీరోయిన్‌గా నటిస్తోంది.
సీనియర్ నటి లయ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. కాగా ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో భాగంగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట.
దాదాపు 70 మంది ఆర్టిస్టులతో రూపొందిస్తోన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ కానుందనీ తెలుస్తోంది. ‘వకీల్ సాబ్’ సినిమాలో ఓ రేంజ్ ఫైట్లు డిజైన్ చేశాడు పవన్ కళ్యాణ్ మీద వేణు శ్రీరామ్.
ఆ తరహాలోనే నితిన్‌పైన కూడా భారీ యాక్షన్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్‌తో పాటూ, నితిన్‌కి బలమైన కామెడీ ట్రాక్ కూడా బాగా చొప్పించినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ టైటిల్ కావడంతో, చాలా ఆచితూచి ఈ సినిమాని జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారట. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com