బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో జోడీ కట్టబోతున్న నయనతార.!
- July 21, 2024
నయన తార హంగామా సౌత్‌లో తగ్గిందా.? లేక తగ్గించిందా.? అంటే ఏమో తగ్గించిందనే అనుమానమొస్తోంది. ‘జవాన్’ సినిమాతో నయన తార బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా నయన తార కోసం లైన్‌లో వున్నాయన్న టాక్ వినిపించింది.
అయితే, వాటి సంగతెలా వున్నా.. తాజాగా ఓ యంగ్ హీరో సినిమాకి నయన తార సైన్ చేసిందనీ తెలుస్తోంది. బిగ్‌బాస్ (హిందీ) గేమ్ షోతో పాపులరైన కెవిన్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాని విష్ణు ఇడవన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కెవిన్‌కి జోడీగా నయన తార నటిస్తోందనీ బాలీవుడ్ గుస గుస. అయితే, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో నయన తార నటించడమేంటీ.?
ఆమె స్టార్‌డమ్ ఏంటీ.? స్టార్ హీరోలతో రొమాన్స్ చేయదగ్గ స్టేటస్ నయన తారది. అలాంటిది ఓ యంగ్ హీరో సినిమాకి సైన్ చేయడమేంటీ.? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ టైమ్.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







