నిఫా వైరస్ కలకలం..రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
- July 21, 2024
న్యూ ఢిల్లీ: ప్రమాదకరమైన నిఫా వైరస్ భారత్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కేరళలో ఓ బాలుడు నిఫా వైరస్ సోకి మృత్యువాత పడ్డాడు. వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన గంటలోనే బాలుడు మృతి చెందడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇది ప్రాణాంతకమైన వైరస్ కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. నిఫా వైరస్ వ్యాప్తి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిఫా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న చోట క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. నిఫా వైరస్ తొలిసారిగా 1999లో వెలుగులోకి వచ్చింది.
అయితే దీనికి వ్యాక్సిన్ లేదు. ఇది జంతువుల ద్వారా మనుషులకు సోకుతుంది. 2018లో కేరళలో ఈ వైరస్ బారినపడి 27 మంది మృతి చెందారు. తాజాగా, కేరళలో మరోమారు నిఫా కలకలం రేగడంతో, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని కేరళకు పంపింది.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







