యూఏఈ గోల్డెన్ వీసా..మంచు విష్ణుకి అరుదైన గౌరవం
- July 21, 2024
దుబాయ్: యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసిన భారతీయుల జాబితాలో టాలీవుడ్ హీరో, మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు చేరారు.తాజాగా యూఏఈ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ టాలీవుడ్ మంచు విష్ణు కు ఎంతో ప్రతిష్టాత్మకమైన 10 సంవత్సరాల యూఏఈ గోల్డెన్ వీసాను మంజూరు చేసింది.మంచు విష్ణు, మంచు వేరోనికాకు ECH Digital LLC కంపెనీ వారు కార్యక్రమం ఏర్పాటు చేసి గోల్డెన్ వీసాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దుబాయ్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ మెంబెర్ దినేష్ కుమార్ ఉగ్గిన,మాగల్ఫ్ ఎడిటర్-ఇన్-చీఫ్ శ్రీకాంత్ చిత్తర్వు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సారా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
యూఏఈ ప్రభుత్వం మొదటిసారిగా 2019లో గోల్డెన్ వీసా కాన్సెప్ట్ తీసుకొచ్చింది. స్పాన్సర్ అవసరం లేకుండా దేశంలో నివసించడానికి, పని చేయడానికి మరియు చదువుకోవడానికి ఈ గోల్డెన్ వీసా వీలు కల్పిస్తుంది. వీసా హోల్డర్లు యూఏఈ ప్రధాన భూభాగంలో వారి వ్యాపారాల పై 100 శాతం మేనేజ్మెంట్ హక్కును కలిగి ఉంటారు. ఐదు లేదా 10 సంవత్సరాల కాలం ఉంటుంది. అయితే, తాజాగా మంచు విష్ణుకి దక్కిన గౌరవం పట్ల యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







