అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

- July 22, 2024 , by Maagulf
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

అమెరికా: అమెరికాలో మరికొన్ని రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ..తాజాగా సంచలన పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్ష బరి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చేసిన ప్రకటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇటీవల కొవిడ్ మహమ్మారి బారిన పడిన బైడెన్.. ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే గత కొంత కాలంగా బైడెన్ ప్రవర్తనా తీరు, ప్రత్యర్థిని ఎదుర్కొవడంలో తడబాటుకు గురి కావడంతో డెమోక్రాట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలని.. డెమోక్రటిక్ పార్టీ నేతలు.. బైడెన్‌ పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. అయినప్పటికీ తానే రేసులో ఉంటానని ప్రకటించిన బైడెన్.. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం.

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ తెలిపారు. దేశ ప్రయోజనాలు, డెమోక్రటిక్ పార్టీ భవిష్యత్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న తాను.. తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తానని ప్రకటించారు. గత కొద్దిరోజులుగా బైడెన్‌ ప్రెసిడెన్షియల్‌ రేసు నుంచి వైదొలగాలని డెమోక్రటిక్ పార్టీ నేతల నుంచి ఒత్తిడి నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆయన ఇటీవలె కరోనా బారిన పడటం కూడా ప్రతికూలంగా మారింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలోనే బైడెన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com