శ్రీవారి భక్తులకు శుభవార్త..
- July 24, 2024
తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. వైకుంఠ వాసుడిని దర్శించుకున్న అనంతరం తమ మొక్కులు చెల్లించుకుంటారు. కోనేటి రాయుడికి కొంత మంది తలనీలాలు సమర్పిస్తే మరికొందరు నగలు, నగదు, బంగారంలతో పాటు విలువైన వస్తులను హుండీల్లో కానుకలుగా సమర్పిస్తుంటారు. ఇలాంటి కానుకల్లో కెమెరాలు సైతం ఉన్నాయి. తాజాగా ఇలా వచ్చిన కెమెరాలను ఈ-వేలం వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తెలిపింది.
తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని హుండీతో పాటు ఇతర తిరుమల అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఆగస్టు 1న ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకుల్లో కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
Nikon, Canon, Kodak వంటి కంపెనీలతో పాటు ఇతర కంపెనీలకు చెందిన కెమెరాలు ఉన్నట్లు తెలిపింది. ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న మొత్తం 10 లాట్ కెమెరాలను ఈ-వేలం కోసం ఉంచుతున్నారు అధికారులు తెలిపారు. ఈ-వేలానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు టీటీడీ మార్కెటింగ్ ఆఫీసు 0877-2264429 నంబర్ లేదా టీటీడీ వెబ్సైట్ http://tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ http://konugolu.ap.gov.inను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







