లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీకి ఖరీదైన బహుమతి ఇచ్చిన అభిమాని
- July 24, 2024
అబుదాబి: లులు గ్రూప్‌కు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు ఇటీవల కేరళకు వచ్చారు.ఈ సందర్భంగా ఒక అభిమాని ఆయన తన తల్లి ఫొటో ఉన్న గడియారాన్ని బహుకరించాడు.
ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే.. బిలియనీర్ అలీ తల్లి ఫొటో కలిగిన ఖరీదైన వాచ్. అభిమాని బహుమతిని చూడగానే బడా వ్యాపారవేత్త అలీ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కేరళలో జన్మించిన యూసఫ్ అలీకి గల్ఫ్, భారత్‌లో 256 హైపర్ మార్కెట్లు, మాల్స్ ఉన్నాయి. అంతేకాదు.. లులు గ్రూప్‌కు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. అలీ వ్యక్తిగత నికర విలువ 8.9 బిలియన్ డాలర్లను మించిపోయింది.
అబుదాబికి చెందిన వ్యాపారవేత్త అలీ తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు ఇటీవల కేరళకు వచ్చారు. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆయన తన తల్లి ఫొటో ఉన్న గడియారాన్ని బహుకరించాడు. “మీ అమ్మ గురించి మీరు మాట్లాడుతున్న వీడియో నేను చూశాను. మీరు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నారో..” అని వాచ్ ఇచ్చిన అభిమాని వీడియోలో తెలిపాడు.
దాని పై స్పందించిన బిలియనీర్ అలీ.. “ప్రతి ఒక్కరూ తమ తల్లులను ప్రేమిస్తారు.. ఇది నాకే కాదు. ప్రపంచంలో తల్లిని ప్రేమించని వారెవరు?” అంటూ బదులిచ్చారు. “ఇది తల్లిని అమితంగా ప్రేమించే వ్యక్తి కోసం.. అందులో మీ అమ్మ ఫొటో చెక్కి ఉంది.. అది వాటర్ ప్రూఫ్ వాచ్,” అని అభిమాని చెప్పాడు. అలీకి వాచ్‌ని అందజేసిన అభిమాని తనతో ఫొటో దిగాలని కోరాడు.
గల్ఫ్ న్యూస్ ప్రకారం.. 2001లో అలీ తన తల్లిదండ్రులిద్దరినీ కారు ప్రమాదంలో కోల్పోయారు. దుబాయ్ నుంచి అబుదాబికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. యూసఫ్ అలీ ఇటీవల తన బంధువు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు కేరళకు వచ్చారు. లులు గ్రూప్ డైరెక్టర్ ఎంఏ సలీం కుమార్తె నౌరిన్ వివాహం త్రిసూర్‌లో జరిగిన హైప్రొఫైల్ వెడ్డింగ్‌లో ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర వీఐపీలు పాల్గొన్నారు.
త్రిసూర్‌లోని హయత్ రీజెన్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ వేడుకలో అలీ అతిథులను పలకరిస్తున్నట్లు చూడవచ్చు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ,యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రి, మరికొందరు అతిథులుగా ఉన్న ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







