ఒమన్‌లో పెరగనున్న బంగారం కొనుగోళ్లు..
- July 25, 2024
మస్కట్: బంగారం మరియు వెండిపై కస్టమ్స్ సుంకాలను 15 శాతం నుండి 6 శాతానికి తగ్గించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారతీయ ప్రవాసులు బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని ఒమన్ సుల్తానేట్‌లోని బంగారు వర్తకులు, ఆభరణాల వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల నుంచి కొనుగోలు చేసిన బంగారం అధిక నాణ్యతతో ఉంటుందని నమ్మకం ఉండటంతో ప్రవాసులను మరింత బంగారం కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుందని స్థానిక వ్యాపారులు భావిస్తున్నారు. “తగ్గిన దిగుమతి సుంకంతో కూడా, భారతదేశంతో పోలిస్తే ఒమన్‌లో బంగారం దాదాపు 5 శాతం తక్కువ ధరకే ఉంటుంది. ఈ దిగుమతి సుంకం తగ్గింపు ఒమన్‌లో బంగారం మరియు నగల కొనుగోళ్లను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.’’ అని మలబార్ గోల్డ్ & డైమండ్స్‌లో ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ షామ్‌లాల్ అహమ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







