పారిస్ ఒలింపిక్స్‌పై కుట్ర..వ్యక్తి అరెస్ట్
- July 24, 2024
పారిస్: పారిస్ ఒలింపిక్స్‌ను అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిన 40 ఏళ్ల రష్యా వ్యక్తిని ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తిని ముందస్తు నిర్బంధంలో ఉంచారు.
నేరం రుజువైతే 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు. రెండు రోజుల్లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయని పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం బుధవారం తెలిపింది.
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఫ్రెంచ్ పోలీసులు రష్యన్ ఇంటిపై దాడి చేసిన తర్వాత 40 ఏళ్ల వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇంటి దగ్గర లభించిన సాక్ష్యాలు ప్రకారం.. ఒలింపిక్స్ క్రీడల సమయంలో గేమ్స్‌ను అస్థిర పరిచేందుకు కుట్రపన్నినట్లుగా గుర్తించారు.
ఇదిలా ఉంటే పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం సీన్ నది దగ్గర ప్రారంభ వేడుకలతో ప్రారంభం కానున్నాయి. ఇక ఉక్రెయిన్, గాజాలో యుద్ధాల నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఫ్రాన్స్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. మరోవైపు రష్యాతో ఫ్రాన్స్‌కు సరైన సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







