భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఐవరీ కోస్ట్‌ అత్యున్నత పురస్కారం

- June 15, 2016 , by Maagulf
భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఐవరీ కోస్ట్‌ అత్యున్నత పురస్కారం

 భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఐవరీ కోస్ట్‌ అత్యున్నత పురస్కారం దక్కింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత రాత్రి అక్కడికి చేరుకున్న ప్రణబ్‌కి సాదర స్వాగతం లభించింది. అనంతరం ఆయన ఆ దేశాధ్యక్షుడు అల్సానే ఔట్టారా ఇచ్చిన విందులో పాల్గొన్నారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో అల్సారే.. ప్రణబ్‌కి వారి దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఈ విషయమై రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఈ పురస్కారాన్ని పొందడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఐవరీ కోస్ట్‌తో భారత్‌ స్నేహ బంధం దీర్ఘకాలం కొనసాగుతుందన్నారు.
ప్రణబ్‌కి ఇలాంటి పురస్కారం ఇదే మొదటిదని ప్రెస్‌ సెక్రటరీ వేణు రాజమోనీ వెల్లడించారు. రాష్ట్రపతికి ఇప్పటి వరకు గౌరవ డిగ్రీలు అనేకం వచ్చాయని అయితే ఒక దేశం నుంచి ఇలాంటి గౌరవం పొందడం ఇదే తొలిసారని చెప్పారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com