వాంటెడ్ క్రిమినల్ ఫైసల్ తాగీని నెదర్లాండ్స్‌కు అప్పగించిన దుబాయ్

- July 30, 2024 , by Maagulf
వాంటెడ్ క్రిమినల్ ఫైసల్ తాగీని నెదర్లాండ్స్‌కు అప్పగించిన దుబాయ్

దుబాయ్: వాంటెడ్ క్రిమినల్ ఫైసల్ తాగీని నెదర్లాండ్స్‌కు అప్పగించినట్లు దుబాయ్ పోలీసులు  వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్ మరియు మానవ అక్రమ రవాణాతో సహా అనేక నేరాలకు అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్‌ లు అతడిపై ఉన్నాయి. అతని తండ్రి రిడౌవాన్ టాగీ 2019 లో దుబాయ్‌లో అరెస్టయ్యాడు.  అప్పుడు అతను 'ఏంజెల్స్ ఆఫ్ డెత్' నాయకుడు. అతను 2016 నుండి విలాసవంతమైన విల్లాలో నివసిస్తున్నాడు.  తప్పుడు గుర్తింపును ఉపయోగించి యూఏఈ లోకి ప్రవేశించాడు.

ఆ సమయంలో నెదర్లాండ్స్ మరియు దుబాయ్‌లకు అప్పగింత ఒప్పందం లేదు. నేరస్తుల అప్పగింత మరియు నేర విషయాలలో పరస్పర సహాయానికి సంబంధించిన రెండు చట్టపరమైన ఒప్పందాలపై దేశాలు ఆగస్టు 2021లో సంతకం చేశాయి.

 ఇంటర్‌పోల్ అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకరిగా మరియు ప్రపంచంలోని అత్యంత హింసాత్మక ముఠాలలో ఒకరిగా పేర్కొంది. అప్పటికి, డచ్ అధికారులు అతనిని అరెస్టు చేయడానికి దారితీసే ఏదైనా సమాచారం కోసం 100,000 యూరోల బహుమతిని అందించారు. కాగా, డచ్ ప్రధాన మంత్రి డిక్ షూఫ్ యూఏఈ భద్రతా సహకారాన్ని ప్రశంసించారు.  ఫైసల్‌ను అప్పగించడంలో దుబాయ్ పోలీసుల పాత్రను ప్రత్యేకంగా అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com