ఈ సంవత్సరం మరో 12 ఎయిర్‌పోర్టుల ప్రారంభం: మోడీ సర్కార్
- July 30, 2024
ఈ సంవత్సరం అదనంగా 12 ఎయిర్‌పోర్టులను ప్రారంభించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇవన్నీ UDAN పథకంలో భాగంగా నిర్మితమవుతున్నాయి. ఇవి 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభమవుతాయని తెలిసింది. ఈ ఎయిర్‌పోర్టులు వస్తే.. ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో 85 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వీటి ద్వారా 579 రూట్లకు కనెక్టివిటీ ఉంది. ఈ ఎయిర్‌పోర్టుల్లో 13 హెలిపాడ్స్, 2 వాటర్ ఎయిరోడ్రోమ్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ 2016 నుంచి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (UDAN) పథకంలో భాగంగా నిర్వహిస్తున్నారు.
ఈ అంశంపై సోమవారం రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు పౌర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహోల్. ఉడాన్ పథకాన్ని కొనసాగిస్తున్నామనీ, ఎప్పటికప్పుడు బిడ్డింగ్ ప్రక్రియ జరుపుతూ.. కొత్త ఎయిర్‌పోర్టులూ, రూట్లు వచ్చేలా చేస్తున్నట్లు తెలిపారు. చాలా ఎయిర్‌పోర్టులను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.
ఈ సంవత్సరం కొత్తగా వచ్చే 12 ఎయిర్‌పోర్టులు.. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్, మధ్యప్రదేశ్‌లోని రేవా, దాతియా, మహారాష్ట్రలోని అమరావతి, సోలాపూర్, డామన్ డయ్యూలోని డామన్, హర్యానాలోని అంబాలా, ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, శహరాన్‌పూర్, తమిళనాడులోని వెల్లూర్, నైవేలీ, అండమాన్ నికోబార్ లోని శివపూర్, కార్ నికోబార్‌లో రానున్నాయి. ఇండియాలో ఎయిర్‌పోర్టులను తీర్చి దిద్దేందుకు తొలి దశలో రూ.4,500 కోట్లు కేటాయించగా, రెండో దశలో రూ.1,000 కోట్లు కేటాయించారు.
ఇండియాలో ఇటు రైల్వేగానీ, అటు ఎయిర్‌పోర్టులు గానీ ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది. జపాన్, చైనా లాంటి దేశాల్లో విమానాలతో పోటీ పడి రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అక్కడ ఎయిర్‌పోర్టుల్లో బోర్డింగ్ టైమ్ వేస్ట్ అవుతుంది, అదే రైల్వేస్టేషన్లలో ఆ పరిస్థితి లేదు. అందువల్ల ఆ దేశాల్లో ప్రజలు.. విమానాల కంటే రైళ్లలో వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. లాంగ్ డిస్టాన్స్ అయితే మాత్రం విమానాల్లో వెళ్తున్నారు. ఇండియాలో విమానయాన రంగంలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. వెంటనే ప్రయాణించేందుకు వీలుగా ఉండేలా, కొత్త ఎయిర్‌పోర్టుల సంఖ్యను బాగా పెంచాలని నిపుణులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







