ఫతే విడుదల తేదీని వెల్లడించిన సోనూసూద్

- July 30, 2024 , by Maagulf
ఫతే విడుదల తేదీని వెల్లడించిన సోనూసూద్

హైదరాబాద్: నటుడు, విలన్ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన సోను సూద్ అంటే ఎక్కువగా గుర్తొచ్చేది సామాజిక సేవ. కరోనా సమయంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా ముందుకు వచ్చి ఆర్థికంగా, పలు రకాలుగా ఆదుకొన్నారు. అలాంటి మహోన్నత సేవ అందించిన సోనుసూద్ జూలై 30వ తేదీన పుట్టిన రోజు జరుపుకొన్నారు.ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు గొప్ప కానుకను అందించారు. ఆయన నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఫతే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ వివరాల్లోకి వెళితే..

నేషనల్ హీరో సోను సూద్ తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈసందర్భంగా తను దర్శకత్వం వహిస్తున్న ఫతే సినిమా రిలీజ్ డేట్‌ను సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు. రిలీజ్ డేట్‌తోపాటు సినిమా పోస్టర్లను కూడా షేర్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై పెరిగిన అంచనాలను మరింతగా పెంచేశారు.

ఇక ఫతే సినిమా దేశంలోనే బెస్ట్ యాక్షన్ ఫిలిం అవుతుంది. ఆ సినిమా కోసం మీరు వేచి చూస్తున్నారని తెలుసు. నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాను. సైబర్ క్రైమ్ బ్యాక్ డ్రాప్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం అని సోను సూద్ వెల్లడించారు.

ఫతే సినిమా ద్వారా సోను సూద్ దర్శకుడిగా మారారు. ఈ సినిమాను శక్తి సాగర్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించగా, అందులో నసీరుద్దీన్ షా, జాక్వలైన్ ఫెర్నాండేజ్ తదితరులు నటించారు. ఇక సినిమా కోసం హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్లను డిజైన్ చేశారు. హాలీవుడ్ స్టంట్ మెన్స్ పర్యవేక్షణలో ఫైట్స్ కంపోజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అందర్నీ ఆకట్టుకొంటున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com