హీరో సందీప్ కిషన్‌కు షూటింగులో ప్రమాదం
- June 15, 2016
టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ షూటింగులో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా ప్రమాదంజరిగింది. ఈ ఘటనలో సందీప్ కిషన్ తలకు బలమైనగాయుం అయినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే సందీప్ కిషన్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'నక్షత్రం' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం మంగళవారం సెట్స్‌పైకి వెళ్లింది.షూటింగ్ తొలి షెడ్యూల్ యాక్షన్ సీన్లతో ప్రారంభించారు.పోరాట సన్నివేశాలు చేస్తుండగా సందీప్ కిషన్ తలకు బలమైన గాయం తగిలిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సందీప్ కిషన్‌కు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.ఈ సినిమాపై సందీప్ కిషన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ కు ఒక్క హిట్టు కూడా లేదు. ఇటీవల విడుదలైన 'ఒక అమ్మాయి తప్ప' చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. కృష్ణ వంశీ లాంటి స్టార్ దర్శకుడితో చేస్తుండటంతో తనకు కలిసొస్తుందని భావిస్తున్నాడు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







