.కొత్త సరుకు రవాణా రైలు..
- June 15, 2016
హైదరాబాద్-చెన్నై రేవుల మధ్య ఎగుమతి, దిగుమతి సరుకులను రవాణా చేయడానికి ఉద్దేశించిన...కొత్త సరుకు రవాణా రైలును దక్షిణమధ్యరైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా బుధవారం... తిమ్మాపూర్ టెర్మినల్ స్లైడింగ్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఇది వారానికి ఒక రోజు నడుస్తుంది. పరిశ్రమల అవసరాలతోపాటు హైదరాబాద్ మార్కెట్, దాని చుట్టుపక్కల జిల్లాలు... మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాలతోపాటు... గుంటూరు జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇది ఉపయోగపడుతుంది. మందులు, ఇంజినీరింగ్ సామగ్రి, ఆటోమొబైల్, జౌళి, శుద్ధి చేసిన ఆహారపదార్థాలు, గ్రానైట్, ముడిసరుకులు, రసాయనాల ఎగుమతి, దిగుమతి సరుకులను ఈ రైలు చేరవేస్తుంది.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్ డీఆర్‌ఎం అరుణాసింగ్, డిసి్ట్రబ్యూషన్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జె.సత్యనాథన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







