కిడ్నీ సమస్యల్ని ముందుగానే గుర్తించడమెలా.?

- July 31, 2024 , by Maagulf
కిడ్నీ సమస్యల్ని ముందుగానే గుర్తించడమెలా.?

శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు సక్రమంగా పని చేస్తేనే శరీరమంతా ఆరోగ్యంగా వుంటుంది. శరీరంలోని వ్యర్ధాల్ని తొలిగించడంలో కిడ్నీల పాత్ర కీలకమైనది.

కిడ్నీల పని తీరు సక్రమంగా లేనట్లయితే శరీరంలోని వ్యర్ధాలు పేరుకుపోయి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయ్. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక ప్రమాదం కూడా సంభవించొచ్చు.

అందుకే కిడ్నీ సమస్యల్ని అస్సలు అశ్రద్ధ చేయరాదని నిపుణులు చెబుతున్నారు. మరి కిడ్నీ సమస్యల్ని ముందుగానే గుర్తించడమెలా.? ముఖ్యంగా కిడ్నీ సమస్యలుంటే కాళ్లలో నొప్పులు మొదలవడం ప్రాధమిక లక్షణంగా చెబుతున్నారు.

కిడ్నీ సమస్యలుంటే కాలి చీల మండలు ముందుగా ప్రభావితం అవుతాయ్. కాలి చీల మండల్లో వాపులు రావడం నొప్పులు, తుంటి కీళ్ల నొప్పులు, పొత్తి కడుపులో నొప్పి తదితర సమస్యలు లక్షణాలుగా గుర్తించాలి.

అలాగే, అజీర్ణం, మూత్ర విసర్ఝనలో ఇబ్బంది, మూత్రంలో రక్తం పడడం వంటి లక్షణాలు సైతం కిడ్నీ సమస్యలకు లక్షణాలుగా చెబుతున్నారు.

నిద్రపోయి లేచిన వెంటనే కాళ్లలో విపరీతమైన నొప్పి, అడుగు నేలపై పెట్టలేకపోవడం కూడా కిడ్నీ సమస్యల్లో చెప్పుకోదగ్గ లక్షణంగా సూచిస్తున్నారు. తక్కువ దూరం కూడా నడవలేకపోవడం, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం.. తదితర లక్షణాలు కిడ్నీ సమస్యలను సూచించేవే. సో, ఈ లక్షణాలుంటే ముందుగానే అలర్ట్ అవ్వాలనీ, వైద్యుని సలహాతో తగు చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com