‘గేమ్ ఛేంజర్’.! కళ కనిపించేదెప్పుడో.!
- July 31, 2024
గ్లోబల్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి వాళ్లు ఆచి తూచి కథలను ఎంచుకోవాలి. ఇప్పటికే ‘ఆచార్య’ రూపంలో ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ చరణ్‌ని వెంటాడుతోంది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత.
ఇప్పుడు రాబోయే సినిమాతో రామ్ చరణ్ కొట్టే హిట్టు అలా ఇలా కాదు.. చాలా గట్టిగా వుండాలి. కానీ, ఆయన నుంచి రాబోయే సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’.
శంకర్ మేకింగ్‌లో వచ్చిన రీసెంట్ మూవీ ‘భారతీయుడు 2’ దారుణంగా దెబ్బ కొట్టేయడంతో మెగా అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయ్. ‘వినయ విధేయ రామ’ కళ కనిపిస్తోంది ఈ సినిమాకి అంటూ కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై.
కానీ, శంకర్ ‘గేమ్ ఛేంజర్’పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్లనే ‘భారతీయుడు 2’కి అలాంటి రిజల్ట్ వచ్చింది.. సో ‘గేమ్ ఛేంజర్’ ఖచ్చితంగా మంచి హిట్టవుతుందని అంటున్నారు.
కానీ, సినిమాపై అంచనాలు పెరగాలంటే సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వదులుతూ వుండాలి కదా. ఇంతవరకూ ఇదిగో అదిగో అంటే వచ్చిన ‘జరగండి..’ పాట తప్ప ఇంకే అప్డేట్ రాలేదు ఈ సినిమా నుంచి.
లేటెస్ట్‌గా కైరా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా వదిలిన పోస్టర్ సైతం ఆల్రెడీ ‘జరగండి..’ పాటలోని స్టిల్‌నే కొత్తగా పోస్టర్ రూపంలో వదిలేశారు. ఈ విషయంలో శంకర్ అండ్ రామ్ చరణ్ కాస్త ఆలోచన చేస్తే బాగుంటుంది మరి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!