పతాకం రక్షణ బాధ్యతలు హెచ్‌ఎండీఏకు
- June 15, 2016
దేశ చరిత్రలోనే అత్యంత భారీ జాతీయ పతాకం రక్షణ బాధ్యతలు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. హుస్సేన్‌సాగర్ తీరప్రాంతమైన సంజీవయ్యపార్కులో 291 ఫీట్ల ఎత్తు, 40 మీటర్ల మందం స్తంభంపై .. 72 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పుతో ఆవిష్కృతమైన మువ్వన్నెల జాతీయ జెండా తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. సంజీవయ్యపార్క్ హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండడం, జెండా నిర్వహణ బాధ్యతలు సైతం హెచ్‌ఎండీఏ చూడాలంటూ ఆర్‌అండ్‌బీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ జెండా నిర్వహణ బాధ్యతలు ఇకపై హెచ్‌ఎండీఏ కంటికి రెప్పలా చూడాల్సి ఉంటుంది. అయితే, గాలిదుమారంతో జాతీయ జెండా గౌరవానికి భంగం కలుగకుండా చూడడం, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే డేగకన్నువే యాల్సి ఉంటుంది.
ప్రధానంగా రాత్రి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందితోపాటు లైటింగ్ ఇతర పనులపై పర్యవేక్షణ తప్పనిసరి. అయితే, ఈ భారీ జెండా నిర్వహణ బాధ్యతలు ఏడాదికి దాదాపు రూ. 50 నుంచి 60 లక్షల మేర ఖర్చు అవుతుందని హెచ్‌ఎండీఏ ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నిర్వహణ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూనే పార్కు లో సందర్శకులను ఆకట్టుకునేలా సుందరీకరణ పనులు చేపట్టి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహణ బాధ్యతలను హెచ్‌ఎండీఏ రెండు రోజుల్లో తీసుకోనున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







